తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో సాయంత్రం కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానము

149
ttd music and dance college

తిరుపతిలోని టిటిడి శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో నడుస్తున్న సాయంత్రం కళాశాలలోని వివిధ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానించడమైనది. కళాశాలలోని 9 విభాగాలలో గాత్రము, వీణ, వయొలిన్‌, వేణువు, హరికథ, భరత నాట్యము, కూచిపూడి నృత్యము, మృదంగము, ఘటము కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. తిరుపతిలోని టిటిడి శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో నడుస్తున్న సాయంత్రం కళాశాలలోని వివిధ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానించడమైనది. కళాశాలలోని 9 విభాగాలలో గాత్రము, వీణ, వయొలిన్‌, వేణువు, హరికథ, భరత నాట్యము, కూచిపూడి నృత్యము, మృదంగము, ఘటము కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇందులో నాలుగు సంవత్సరాల సర్టిఫిట్‌ కోర్సుకు 11 నుండి 60 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇందుకోసం ఒక సంవత్సరానికి రూ.1500/- ఫీజు చెల్లించాలి. రెండు సంవత్సరాల వ్యవధి గల డిప్లొమా కోర్సుకు 15 నుండి 60 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇందుకోసం ఒక సంవత్సరానికి రూ.1700/- ఫీజు చెల్లించాలి. రెండు సంవత్సరాల కళాప్రవేశిక కోర్సుకు 8 నుండి 60 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, 2వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీనికోసం ఒక సంవత్సరానికి రూ.1000/- ఫీజు చెల్లించాలి.

ఆశక్తి గలవారు రూ.25/- చెల్లించి దరఖాస్తులను పొందవచ్చు. పూర్తిచేసిన దరఖాస్తులను జూలై 7వ తేదీ సాయంత్రం 4.00 గంటల లోపల కళాశాలలో అందజేయల్సి ఉంటుంది. ఈ కోర్సులకు జూలై 11 నుండి 15 వ తేదీ వరకు ఇంటర్యూలు, అడ్మిషన్లు నిర్వహిస్తారు. జూలై 18 నుండి సాయంత్రం 5.30 గంటలకు తరగతులు ప్రారంభమవుతాయ.

రెండవ విడత అడ్మిషన్లు జూలై 25వ తేదీ నుండి ప్రారంభమవుతాయ. ఇతర వివరాలకు ప్రిన్సిపాల్‌, ఎస్‌.వి.సంగీత నృత్య కళాశాల కార్యాలయము, బాలాజీ కాలనీ, తిరుపతి-517502. ఫోన్‌ నెం.0877-2264597లో ఉదయం 11.00 నుండి సాయంత్రం 4.00 గంటలలోపు సంప్రదించాలి.

Advertisements