జూలై 26 నుంచి 30వ తేదీ వరకు ఐదు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు

204
srinivasa kalyanam

టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూలై 26 నుంచి 30వ తేదీ వరకు ఐదు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి.

->జూలై 26వ తేదీన చిత్తూరు జిల్లా జిడి.నెల్లూరు మండపం నెల్లేపల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

->జూలై 27న చిత్తూరు జిల్లా పూతలపట్టులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

->జూలై 28న అనంతపురం జిల్లా నార్పలలో గల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.

->జూలై 29న అనంతపురం జిల్లా ధర్మవరంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

->జూలై 30న అనంతపురం జిల్లా మడకసిరలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో  స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.

శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు టిటిడి రాష్ట్రంలోనే గాక, దేశవిదేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు కానున్నాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ కె.ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Advertisements

Leave a Reply