కోదండరామాలయంలో  విశేష ఉత్సవాలు

124
kondanda rama swamy tirupati

తిరుపతిలో టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీకోదండరామాలయంలో అక్టోబరులో జరుగనున్న ఉత్సవాల వివరాలిలా ఉన్నాయి.

->అక్టోబరు 7, 14, 21, 28వ తేదీల్లో శనివారం ఉదయం 6 గంటలకు మూలవర్లకు అభిషేకం, సాయంత్రం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవర్లకు బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 7 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

->అక్టోబరు 5న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. రూ.50/- టికెట్‌ కొనుగోలుచేసి భక్తులు పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవర్లను తిరుచ్చిపై శ్రీ రామచంద్ర పుష్కరిణికి ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6.30 గంటలకు అక్కడే ఆస్థానం చేపడతారు. 

->అక్టోబరు 13న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. రూ.500/- టికెట్‌ కొనుగోలు చేసి భక్తులు పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవర్లను తిరుచ్చిపై శ్రీ రామచంద్ర పుష్కరిణికి ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6.30 గంటలకు అక్కడే ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

->అక్టోబరు 19న అమావాస్య సందర్భంగా ఉదయం 6.30 గంటలకు సహస్ర కలశాభిషేకం చేపడతారు. రూ.500/- టికెట్‌ కొనుగోలు చేసి భక్తులు పాల్గొనవచ్చు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ నిర్వహిస్తారు.

Advertisements

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.