పెద్దశేషవాహనం పై విహరించనున్న శ్రీ మలయప్పస్వామివారు

149
pedda sesha vahanam

అక్టోబరు 23న నాగుల చవతి పర్వదినం సందర్భంగా శ్రీ మలయప్పస్వామి వారు తన ఉభయ దేవేరులతో కూడి తిరుమల నాలుగు మాడ వీధులలో పెద్దశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేయనున్నారు.

కాగా సర్ప రాజైన ఆదిశేషువు జగన్నాధునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా , పాదుకలుగా, శయ్యలాగా, ఛత్రంగా, కామరూపియై వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా స్వామివారికి సేవలందిస్తున్నట్లు పురాణాలు ఘోషిస్తున్నాయి. అంతే కాకుండా శ్రీవారి ఆలయంలోని దాదాపు 8 శాసనాలపై శేషునిపై అనేక స్తుతి సూక్తులున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామలలో ”శేషసాయి, శేషస్త్యుః, శేషాద్రినిలయః” అంటూ నిత్య పూజలందుకుంటున్నాడు.

అంతే కాకుండా రామావతారంలో లక్ష్మణునిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీ వైకుంఠంలోని నిత్య సూరులలో ఆద్యుడు.

ఈ విధంగా స్వామివారు దాస భక్తికి మారు రూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషువుపై ఉభయదేవేరులతో కూడి భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగత ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపజేస్తున్నారు. అందుకే బ్రహ్మూెత్సవ వాహనసేవలలో తొలి ప్రాధాన్యత కూడా ఆదిశేషునికే ఆ భగవంతుడు ప్రసాదించాడు.

కాగా నాగుల చవతి పర్వదినంనాడు రాత్రి 7.00 గంటల నుండి 9.00 గంటల నడుమ తిరుమాడ వీధులలో పెద్ద శేషవాహనంపై ఊరేగింపు జరుగుతుంది.

Advertisements