రెండు నడక మార్గాల్లో కలిపి భక్తులకు 20 వేల టోకెన్లు జారీ

246
divya darshan tokens

కాలినడక భక్తులు ఎక్కువసేపు క్యూలైన్లలో వేచి ఉండకుండా, రెండున్నర గంటల్లోపు మెరుగైన శ్రీవారి దర్శనం కల్పించేందుకు సోమవారం నుండి ప్రతిరోజూ రెండు నడకమార్గాల్లో కలిపి 20 వేల టోకెన్లు జారీ చేస్తున్నట్టు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. 

తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో సోమవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఈవో మాట్లాడుతూ శుక్ర, శని, ఆదివారాలతోపాటు ఇకపై ప్రతిరోజూ ఈ మేరకు టోకెన్లు జారీ చేస్తామన్నారు. మొత్తం 20 వేల టోకెన్లలో సోమవారం అలిపిరి మార్గంలో 14 వేలు, శ్రీవారి మెట్టు మార్గంలో 6 వేల టోకెన్లు జారీ చేసినట్టు తెలిపారు. భక్తులకు సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం, వసతి ఇతర సౌకర్యాలు కల్పించడమే తమ ధ్యేయమన్నారు. భక్తుల సౌకర్యార్థం ఇటీవల తిరుమలలో గదులు పొందేందుకు టోకెన్ల మంజూరు విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ విధానానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు.

కాగా, అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గాల్లో సోమవారం టోకెన్ల జారీ నూతన విధానం ప్రారంభమైంది. అలిపిరి వద్దగల టోకెన్‌ జారీ కౌంటర్‌ను సాయంత్రం 4.30 గంటలకు, శ్రీవారి మెట్టు వద్ద గల టోకెన్‌ జారీ కౌంటర్‌ను సాయంత్రం 5.30 గంటలకు టోకెన్లు జారీ ప్రక్రియ పూర్తయింది.

నూతనంగా ప్రవేశపెట్టిన టోకెన్ల జారీ విధానం ద్వారా రెండున్నర గంటల్లోపు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టిటిడి చేపట్టిన ఏర్పాట్లపై భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

Advertisements

Leave a Reply