శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

110
kondanda rama swamy tirupati

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో నవంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు,

నవంబరు 4, 11, 18, 25వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6.00 గంటలకు స్వామి, అమ్మవారి మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. భక్తులు రూ. 20- చెల్లించి అభిషేకసేవలో పాల్గొనవచ్చు. సాయంత్రం 6.00 గంటలకు బంగారు తిరుచ్చిలో ఉత్సవమూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం ఆలయంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. 

నవంబరు 4వ తేదీ పౌర్ణమి నాడు ఉదయం 9.00 గంటలకు ఆలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం జరుగనుంది. భక్తులు రూ.50 చెల్లించి శతకళాశాభిషేకంలో పాల్గొనవచ్చు. ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారిని నాలుగు మాడ వీధుల ద్వారా రామచంద్ర పుష్కరిణి వరకు ఊరేగింపు, ఆలయంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

నవంబరు 9వ తేదీన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని  ఆలయంలో శ్రీ సీతారామ కల్యాణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారిని నాలుగు మాడ వీధుల ద్వారా రామచంద్ర పుష్కరిణి వరకు ఊరేగింపు చేపట్టి అక్కడే ఊంజల్‌సేవ చేపడతారు. భక్తులు రూ. 500 చెల్లించి స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొనవచ్చు.

నవంబరు 18వ తేదీ అమావాస్యను పురస్కరించుకుని ఉదయం 6.30 గంటలకు ఆలయంలో సహస్ర కళాశాభిషేకం జరుగనుంది. భక్తులు రూ.500- చెల్లించి సహస్ర కశాభిషేకంలో పాల్గొనవచ్చు. ఈ సందర్భంగా రాత్రి 7.00 గంటలకు శ్రీకోదండరామస్వామివారు హనుమంత వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. 

Advertisements