గరుడోత్సవానికి అధనపు సిబ్బంధితో పటిష్ట బంధోబస్తు

151
police protection on garuda seva

 గరుడోత్సవానికి  అదనంగా  1000 మంది సిబ్బందితో  పటిష్ట భద్రత  ఏర్పాటు  చేయడం  జరిగింది .  శ్రీవారి  బ్రహ్మొత్సవాలను  తిలకించే  భక్తుల  సంఖ్య  రోజు  రోజుకీ  పెరుగుతోంది .  బుధవారం  జరిగే  స్వామి  వారి  గరుడోత్సవానికి  ఈ సారి  పెద్ద  మొత్తంలో  హాజరవుతారని  అంచనా .  ఈ నేపద్యంలో  ఎటువంటి  అవాంఛనీయ  సంగటనలు జరగకుండా  పోలీసు  ఉన్నత అధికారులు  పటిస్టమైన  బంధోబస్తు  ఏర్పాట్లు  చేయడం  జరిగింధి . అనంతపూర్  రేంజ్  డిఐజి  శ్రీ  జె. ప్రభాకర్  రావు  ఐపియస్  గారి  ఆద్వర్యంలో  తిరుపతి  ఉర్బన్   జిల్లా  యస్ పి శ్రీ  అభిషేక్  మొహంతి  ఐ పి  యస్  గారు  తదితర  ఉన్నత  అధికారులు  స్వయంగా  ధగ్గరుండి  పర్యవేక్షిస్తున్నారు .  ట్రాఫిక్, క్రైమ్  పరంగా  ఎక్కడా  ఇబ్బంది  కలగకుండా ,  ధర్శనం  కోసం  వచ్చే  భక్తులు  సమన్వయం  పాటిస్తూ  పోలీసులకి  సహకరించాలని  కోరారు . గరుడోత్సవం   సంధర్భంగా    26.09.2017 అర్ధరాత్రి 12 గంటల నుండి  గరుడోత్సవం  ముగిసేవరకు  అనగా  28.09.2017 మద్యాహ్నం  2 గంటల  వరకు  తిరుమల  ఘాట్  రోడ్  పై ద్విచక్ర  వాహనాలు  అనుమతించబడవని  ద్విచక్ర  వాహనాలలో  వచ్చువారు  అలిపిరి  వద్ద  ఏర్పాటుచేసిన  పార్కింగ్  చేసుకువాలని తెలిపారు . గరుడసేవ రోజు  ట్రాఫిక్  ఇబ్బంధి  కలిగినచో  అప్  ఘాట్ రోడ్లో  కూడా వాహనములను కిందకు పంపడం జరుగుతుందని   తెలిపారు .

Advertisements

Leave a Reply