Advertisement
Categories: Articles

శ్రీమూష్ణం – వరాహక్షేత్రం

శ్రీ మహావిష్ణువు భారతదేశంలో స్వయం ఆవిర్భవించిన క్షేత్రాలు:
1. శ్రీరంగం, 2. శ్రీమూష్ణం, 3. తిరుపతి, 4. వానమామలై, 5.సాలగ్రామం, 6. పుష్కరం, 7. నైమిశారణ్యం మరియు 8. బదరికాశ్రమం.

శ్రీమూష్ణం

వాటిలో ఒక క్షేత్రం శ్రీమూష్ణం. తమిళనాడు లోని కడలూరు జిల్లాలో, వృధ్ధాచలానికి 19 కి.మీ. ల దూరంలోనూ, చిదంబరం నుంచి 39 కి.మీ. ల దూరంలో ఉన్నది. ఇక్కడ స్వామి భూమినిరక్షించిన తర్వాత వరాహమూర్తిగావెలిశాడు. అందుకే ఇది వరాహక్షేత్రం. ఈ క్షేత్రంలో శ్రీమహావిష్ణువుమూడు రూపాలలో ఉన్నాడనిభక్తుల నమ్మకం. అవి అశ్వత్థవృక్షం, నిత్య పుష్కరిణి, భూవరాహం. నిత్య పుష్కరిణిలోస్నానం చేస్తే రోగాలు పోతాయి. అశ్వత్థ వృక్షాన్ని పూజిస్తే పిల్లలులేనివారికి పిల్లలు పుడతారు. ఈపుష్కరిణిలో స్నానం చేసి ఇక్కడి అశ్వత్థ వృక్షం కింద గాయత్రిమంత్రాన్ని జపిస్తే స్వర్గంలభిస్తుందంటారు.

ఆలయ నిర్మాణం

సమున్నతమైన గోపురంతో, విశాలమైన ఆవరణలో, మండపాలతో అలరారే ఈ  అత్యంత పురాతనమైన ఆలయం  ప్రకృతి ఆటుపోట్లని ఎన్నింటినోతట్టుకుంది. ఇక్కడ ఉన్న శాసనాల ఆధారంగా ఈ ఆలయం 16వశతాబ్దం నుంచి ప్రాముఖ్యత సంతరించుకుంది. విజయనగరాన్ని  పాలించిన రాజులు ఈ ఆలయాన్నిపునర్నిర్మించటమేగాక వివిధ మండపాలను నిర్మించారు. నిత్య పూజలకి ఏర్పాటు చేసి, స్వామి ఊరేగింపుకి వాహనాలుఏర్పాటు చేశారు.

స్ధల పురాణం

హిరణ్యకశిపుడి సోదరుడైనహిరణ్యాక్షుడు విశ్వమంతా తమ ఆధిపత్యమే సాగాలని భూదేవిని ఎత్తుకుపోయి సముద్రంలో ఉంచుతాడు. భూదేవి శ్రీమహావిష్ణువుని ప్రార్థిస్తే ఆయన వరాహ రూపం లో వచ్చి హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు. తర్వాత  ఇక్కడ ఆయన తన నేత్రాల నుంచి అశ్వత్థ వృక్షాన్నీ, తులసిని సృష్టించాడు. యుధ్ధంలో చిందిన ఆయన స్వేదంతో నిత్యపుష్కరిణి ఏర్పడింది. భూదేవిని రక్షించినతర్వాత స్వామి సాలగ్రామ శిలలో స్వయంభూగా ఇక్కడ వెలిశాడు. అమ్మవారు అంబుజవల్లీతాయారు.

ఆలయ విశేషాలు

స్వామి విగ్రహం చిన్నదే. ఇక్కడ  స్వామి పడమర ముఖంగావెలిశాడు. శరీరమంతా పడమర ముఖంగా ఉన్నా, ముఖం మాత్రం దక్షిణం వైపు చూస్తుంటుంది.

హిరణ్యాక్షుడు తన ఆఖరిసమయంలో స్వామిని తనవైపుచూడమని ప్రార్థించాడు. అందుకేస్వామి అతనున్న దక్షిణం వైపుచూస్తుంటాడు.  స్వామి చేతులు  నడుంమీద పెట్టుకుని ఉంటాడు. స్వామి వరాహరూపం అమ్మవారికినచ్చక స్వామిని తన అందమైనరూపంలో కనిపించమని ప్రార్థిస్తుంది. అమ్మవారి కోరికపై స్వామి యజ్ఞనారాయణస్వామి గా అందమైన రూపంలో, శంఖుచక్రాలతో వెలిశాడు. అందుకే ఇక్కడ ఉత్సవ విగ్రహం వరాహరూపంలో ఉండదు.  ఉత్సవ విగ్రహాలు గర్భగుడిలోమూల విరాట్దగ్గర ఉండవు. ముందు మండపంలో ఉంటాయి. స్వామి దగ్గర చిన్న కృష్ణుడి విగ్రహంవుంటుంది. ఇది కూడా స్వామితోబాటు స్వయంభువు. స్వామికి సాలగ్రామాల మాల అలంకరించబడి ఉంటుంది. స్వామికి 7గురు అక్కచెల్లెళ్ళున్నారని చెబుతారు. వీరివిగ్రహాలు ఆలయంలో వేరేమండపంలో చూడవచ్చు.

అన్నింటికన్నా ఆసక్తికరమైన విశేషం పది రోజుల పాటు బ్రహ్మాండంగా జరిగే స్వామి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు,  భరణీ నక్షత్రం  ఉన్న రోజున స్వామివారిని ఊరేగింపుగా సముద్రం దగ్గరకు తీసుకెళ్తారు. సముద్రం చేరుకునేలోపల  తాయ్కల్ అనే గ్రామంలో ఒక మసీదు దగ్గర ఊరేగింపు ఆగుతుంది. అక్కడస్వామికి పూజలు జరుగుతాయి. కాజీ స్వామికి పూలదండ సమర్పిస్తారు. మసీదులో కర్పూరం వెలిగించిన తర్వాత ఖురాన్చదువుతారు. బాణాసంచా హడావిడితో తిరిగి ఊరేగింపుసాగుతుంది. దీనికొక కథ ఉన్నది. ఒకసారి ఇక్కడ నవాబుగారికి జబ్బుచేసి ఎంత వైద్యం చేసినాతగ్గలేదు. ఒకసారి స్వామి భక్తుడైన ఒక  మధ్వ బ్రాహ్మణుడు నవాబుని కలవటానికి ఆయన నివాసానికి వెళ్ళారు. ఆయన నవాబుగారి స్ధితిచూసి తనతో గుడి నుంచి ప్రసాదంగా తెచ్చుకుంటున్న తీర్థం ఇచ్చారు. నవాబు అయిష్టంగానే తీసుకున్నా ఆయన జబ్బు వెంటనేతగ్గిపోయింది. అందుకు కృతజ్ఞతగానవాబు ఆలయానికి అనేక ఎకరాలసారవంతమైన భూమి ఇచ్చారు. ఆ ఆస్తి ఇప్పటికీ మధ్వ బ్రాహ్మణులరక్షణలో ఉన్నదంటారు.

ఉత్సవాలు

ఏప్రిల్, మే నెలలలో వచ్చే చిత్రై  ఉత్సవాలలో  శ్రీదేవి, భూదేవి  సమేతంగా స్వామిని ఆలయంచుట్టూ ఉన్న నాలుగు మాడవీధులలో ఊరేగిస్తారు. తర్వాత నిత్య పుష్కరిణిలో కన్నుల పండుగగా జరిగే తెప్పోత్సవంతో ఇది ముగుస్తుంది. బ్రహ్మోత్సవాలలో జరిగే ఊరేగింపు చూడటానికి చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఫిబ్రవరి, మార్చిలలో వచ్చే ఈ ఉత్సవాలలో దేవేరులతో సహా స్వామి చుట్టుపక్కల గ్రామాలకి ఊరేగింపుగా వెళ్ళి భక్తులకు దర్శనమిస్తాడు. అమ్మవారు అంబుజవల్లి  కి నవరాత్రుల లో విశేష ఉత్సవాలు జరుగుతాయి. తమిళ నెలలైన ఆడి, తాయ్ లలో ఆఖరి శుక్రువారం నాడు అమ్మవారిని సువాసన భరితమైన పుష్పాలతో అలంకరించిన పల్లకీలో ఊరేగిస్తారు.

పూజా విశేషాలు

ఈ స్వామిని పూజించటంవల్ల జీవితంలో సకల సంపదలూ లభిస్తాయంటారు. గ్రహదోషాలున్నవారు ఈ ఆలయంలో స్వామిని సేవిస్తే ఆ దోషాలు తొలగిపోతాయంటారు. కొత్త వాహనాలు కొన్నవెంటనే, ముందు ఈ స్వామి దగ్గర పూజచేయిస్తారు. అలాగే యాక్సిడెంట్అయిన వాహనాలు కూడా బాగుచేయించాక వాడక ముందు ఇక్కడికి తీసుకువచ్చి పూజ చేయిస్తారు.

దర్శన సమయాలు: ఉదయం 6 గం.ల నుంచి 12 గం.ల వరకు, తిరిగి సాయంత్రం 4 గం.ల నుంచి 8-30 వరకు.

వసతి:ఆలయం పక్కనే గెస్ట్ హౌస్వున్నది.

మార్గం: చెన్నై నుంచి, వృధ్ధాచలం నుంచి బస్సులున్నాయి. రైలులోవచ్చేవారు వృధ్ధాచలంలో దిగి, అక్కడనుంచి బస్ లో రావచ్చు.

Advertisement

Recent Posts

Important Days in Tirumala Tirupati Temples in May – 2024

Important Days in Tirumala Tirupati Temples in May - 2024 ** 1st May - May…

7 days ago

Special Days in Tirumala in May – 2024

Special Days in Tirumala in May - 2024 ** 4th May – Sarva Ekadashi **…

1 week ago

Important Days in Tirumala Tirupati Temples in April – 2024

Important Days in Tirumala Tirupati Temples in April - 2024 ** 4th April - Srinivasa…

1 month ago

Events At Tirumala In April -2024

Events At Tirumala In April -2024 ** 5th April - Sri Annamacharya Vardhanti ** 7th…

1 month ago

Sri Kodandarama Swamy Brahmotsavams – 2024

Sri Kodandarama Swamy Brahmotsavams - 2024 Sri Kodandarama Swamy Brahmotsavams in Tirupati will starts from…

1 month ago

Sri Rama Navami Utsavam at Kodandarama swamy Temple – 2024

Sri Rama Navami Utsavam at Kodandarama swamy Temple, Tirupati TTD is organising the annual Sri…

1 month ago