ఈ నెల 18 న తిరుపతి లో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమనరీ పరీక్ష

0
170

# తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో UPSC Civils Preliminary పరీక్షల నిర్వహణ పై జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీషా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జెసి2 చంద్రమౌళి, డిఆర్ఓ రజియా బేగం, సబ్ కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా అధికారులు, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ లు పాల్గొన్నారు.

# జాయింట్ కలెక్టర్ గిరీషా మీటింగ్ పాయింట్స్

# చిత్తూరు జిల్లా తిరుపతి లో జూన్ 18 న ఉదయం 9:30 నుండి 11:30 వరకు పేపర్1, మధ్యాహ్నం 2:30 నుండి 4:30 వరకు పేపర్ 2 యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమనరీ పరీక్షను 13 కేంద్రాల్లో 5919 మంది వ్రాస్తారు.

# దేశంలో చాలా కీలకమైన, అతున్నత ఐఏఎస్, ఐపీఎస్ తదితర అల్ ఇండియా సర్వీస్ ఉద్యోగాల ఎంపిక లో భాగంగా ఈ నెల 18 న ఆదివారం యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమనరీ పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని, ఇటువంటి కీలకమైన సివిల్స్ ప్రిలిమనరీ పరీక్షను తిరుపతి లో 13 కేంద్రాల్లో కూడా నిర్వహించడం ఈ ప్రాంత అభ్యర్థులకు మంచి సౌకర్యవంతం అని అందువల్ల ఎటువంటి లోటుపాట్లకు తావు ఇవ్వకుండా, ప్రతి అంశంలోను యూపీఎస్సీ ఇచ్చిన ఆదేశాలను తూ. చ. తప్పక పాటించి పగడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

# యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమనరీ పరీక్ష నిర్వహణ పై ఇటీవల ఢిల్లీ లో పరీక్షల కేంద్రాలు ఉన్న జిల్లాల కలెక్టర్ల తో యూపీఎస్సీ సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలను చేసిందని, యూపీఎస్సీ సూచనలను, ఆదేశాలను ఖచ్చితంగా, ఎటువంటి డివియేషన్ లేకుండా పాటించి సివిల్స్ ప్రిలిమనరీ పరీక్షలను తిరుపతి లో విజయవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు

# తిరుపతి యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమనరీ పరీక్షల అబ్జర్వర్ గా రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎం.డి. కె.రాంగోపాల్ ను ప్రభుత్వం నియమించిందని, జిల్లా కోఆర్డినేటింగ్ సూపర్వైజర్ గా కలెక్టర్, ఢిల్లీ యూపీఎస్సీ ఇన్స్పెక్టింగ్ అధికారిగా
ఎస్ హెచ్ ధ్యాన్ స్వరూప్ ఉంటారని జాయింట్ కలెక్టర్ వివరించారు.

#జిల్లా కలెక్టర్ కు అసిస్టెంట్ కో ఆర్డినేటింగ్ అధికారులుగా జెసి 2 చంద్రమౌళి, డిఆర్ఓ రజియా బేగం, సిపిఓ భాస్కర్ శర్మ, డీఆర్డీఏ పి.డి.రవి ప్రకాష్, డ్వామా పిడి కూర్మనాథ్, డిపిఓ ప్రభాకర్ రావు , చిత్తూరు ఆర్డీవో కోదండరామి రెడ్డి లను నియమించినట్లు జెసి తెలిపారు.

# 13 పరీక్షా కేంద్రాలకు 13 మంది చీఫ్ సూపరింటెండెంట్స్ ను, 13 మంది తాసిల్దార్లను సిట్టింగ్ స్క్వాడ్లుగా నియమించామని, సివిల్స్ ప్రిలిమనరీ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించే గురుతర బాధ్యత వీరిపైనే ఉంటుందని , నిష్పక్షపాతంగా, నిబంధనల మేరకు పారదర్శకంగా పరీక్షను నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.

# యూపీఎస్సీ పరీక్షల నిర్వహణలో అనుభవం ఉన్న అధ్యాపకులను మాత్రమే ఇన్విజిలేటర్ లుగా నియమించాలని, ఎవరూ కూడా సెల్ ఫోన్స్ ను పరీక్షల కేంద్రం లోపలికి తీసుకెళ్లకూడదని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.

# అభ్యర్థులకు యూపీఎస్సీ తెలిపిన అన్ని సూచనలను క్షున్నంగా వివరించాలని, పరీక్ష ప్రారంభించడానికి అరగంట ముందే అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, పరీక్ష ప్రారంభం అయిన 10 నిముషాల లేట్ వరకు మాత్రమే అనుమతించాలని, అనంతరం మెయిన్ గేట్ క్లోజ్ చేయించి, పగడ్బందీగా పోలీస్ భద్రత ను ఏర్పాటు చేయించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.

# అభ్యర్థులు, పరీక్ష కేంద్రాల ఇన్విజిలేటర్లు ఎవరూ కూడా సెల్ ఫోన్స్, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, పరికరాలను, బుక్స్, పేపర్స్ ను పరీక్షల కేంద్రం లోపలికి తీసుకెళ్లకూడదని, అనుమతించకూడదని , పోలీసులు క్షున్నంగా తనిఖీలు చేయాలని జెసి ఆదేశించారు.

# పరీక్ష కేంద్రాలలో మంచి డెస్క్ లు, నిరంతర విద్యుత్, మంచి నీరు, ప్రాథమిక చికిత్స కేంద్రం, తదితర సౌకర్యాలను , నిబంధనల మేరకు సీటింగ్ ఏర్పాట్లను బాగా చేసి , పరీక్ష ప్రారంభానికి కేవలం 2 గంటల ముందు మాత్రమే డిస్ప్లే చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.

# యూపీఎస్సీ నిబంధనల మేరకు , పరీక్ష ప్రశ్న పత్రాలను పరీక్ష ప్రారంభానికి కేవలం 3 నిముషాల ముందు మాత్రమే పంపిణీ చేయాలని, పరీక్షల సమయం మొత్తం పూర్తి అయ్యేవరకు అభ్యర్థులను పరీక్ష హాల్ నుండి బయటకు పంపకూడదని , అంధులకు, వికలాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు, ఇన్విజిలేటర్స్ ను ఏర్పాటు చేయాలని జేసీ ఆదేశించారు.

# యూపీఎస్సీ నిబంధనల మేరకు ప్రశ్న పత్రాల, జవాబు పత్రాల భద్రత,ఓపెనింగ్, ప్యాకేంగ్ ను పగడ్బందీగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.

# ఇన్విజిలేటర్ల కు పరీక్ష రూంను పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు లాటరీ పద్ధతి లో మాత్రమే రూమ్ కేటాయింపును చేయాలని చీఫ్ సూపరింటెండెంట్స్ ను జె.సి. ఆదేశించారు.

# యూపీఎస్సీ నిబంధనల మేరకు అనుమతి ఉన్న వారు మాత్రమే పరీక్ష కేంద్రంలో ఉండాలి. ఆన్ ఆతరైజ్డ్ వ్యక్తులు పరీక్ష కేంద్రంలో ఉంటే సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్స్ పై చర్యలు.

# అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ఏదేని ఒక ఐ.డి.ప్రూఫ్ ను ఖచ్చితంగా తీసుకురావాలి.

# 13 పరీక్ష కేంద్రాలకు 13 మంది ఎస్ ఐ లను, తగినంత మంది పోలీసులతో గట్టి భత్రతను ఏర్పటు చేయాలని, మెటల్ డిటెక్టర్ డోర్స్ ను ఏర్పాటు చేసి పగడ్బందీగా ఫ్రిస్కింగ్ చేసి సెల్ ఫోన్స్ ను, ఎలక్ట్రానిక్ పరికరాలను, బుక్స్, పేపర్స్ ను పరీక్ష కేంద్రం లోపలికి అనుమతించకూడదని, పరీక్ష ప్రారంభం అయిన 10 నిముషాల వరకు మాత్రమే లేటుగా వచ్చే వారిని అనుమతించాలని, అనంతరం గేట్స్ మూసేయాలని , పరీక్ష సమయం ముగిసే వరకు ఎవరిని బయటకు పంపకూడదని డిఎస్పి రవి మనోహరాచారి ని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.

# 13 పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను విధించాలని, అమలు చేయాలని తిరుపతి అర్బన్, రూరల్ తాసిల్దార్ల ను , రెవిన్యూ, పోలీస్ అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. పరీక్షల కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్స్ ను మూసేయించాలని కూడా ఆదేశించారు.

# అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, కలిగించకుండా , యూపీఎస్సీ నిబంధనల మేరకు అందరూ అధికారులు , నిబంధనల
బుక్ లెట్స్ ను సమగ్రంగా చదువుకుని, సమన్వయంతో వ్యవహరించి తిరుపతి లో జూన్ 18 న యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమనరీ పరీక్షలను కట్టుదిట్టంగా, విజయవంతంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ గిరీషా అధికారులను ఆదేశించారు.

Advertisements

Leave a Reply